4 May, 2026 | 11:22 AM

రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన కిరణ్మయి

07-08-2025 10:54 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): జనగామ జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్-8 జావలిన్ త్రో టోర్నీలో మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం గిరిజన సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయం విద్యార్థిని కిరణ్మయి గోల్డ్ మెడల్ సాధించినట్లు ప్రిన్సిపల్ హర్షిత తెలిపారు. అండర్-8 60 మీటర్ల పోటీలో కిరణ్మయి ప్రతిభ చాటి గోల్డ్ మెడల్ సాధించినట్లు ఆమె తెలిపారు.