calender_icon.png 8 August, 2025 | 1:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘కలివి వనం’ సందేశాత్మక సినిమా

07-08-2025 10:58:53 PM

చేవెళ్ల: ‘కలివి వనం’సినిమా సామాజిక సందేశం ఇచ్చే సినిమా అని చేవెళ్ల పిఎసిఎస్ చైర్మన్ దేవర వెంకటరెడ్డి(PACS Chairman Devara Venkata Reddy), డిసిసి ఉపాధ్యక్షులు ఆగిరెడ్డి అన్నారు. గురువారం చేవెళ్ల  పట్టణ కేంద్రంలోని కేసిఆర్ గార్డెన్ లో వివేకనంద కళాశాల ఆధ్వర్యంలో "కలివి వనం" సినిమా ఆడియో సాంగ్ ఫ్రీ రిలీజ్ ను ఘనంగా నిర్వహించారు. కలివివనం మూవీకి రాజ్ నరేంద్ర దర్శకత్వం వహించగా, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని, గుండాల గ్రామానికి చెందిన మల్లికార్జున్ రెడ్డి, షాబాద్ మండలం చందనవెల్లి గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. లేడీ ఓరియంటెడ్ గా రూపొందించిన సినిమాలో నాగ దుర్గ లీడ్ రోల్ పోషించగా, చేవెళ్ల మండలంలోని పామేన గ్రామానికి చెందిన బిత్తిరి సత్తి(అలియాస్ రవి) ప్రత్యేక పాత్రలో అలరించనున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కలివి వనం అడవులు, నదులు, పర్యావరణ వ్యవస్థను రక్షించడం మానవుల ప్రాధమిక బాధ్యత అనేది ఈ సినిమా ఉద్దేశం అని తెలిపారు. ప్రతి ఒక్కరూ పర్యావరణం పట్ల స్పృహను కలిగి ఉండాలని అన్నారు. కుటుంబం, స్నేహం, సామూహిక స్పృహ వంటి భావనలతో పాటు ఇది ఒక ప్రేరణాత్మకమైన సినిమాను తీసినందుకు డైరెక్టర్ రాజ్ నరేంద్రను అభినందించారు. చేవెళ్ల ప్రాంతం నుంచి, అతి చిన్న వయసులో కలివి వనం సినిమాకు ప్రొడ్యూసర్ గా సేవలందించిన మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద కళాశాల ప్రిన్సిపల్ జైపాల్ రెడ్డి, కలివివనం సినిమా ప్రధాన పాత్ర దారుడు గాంధీచే చేవెళ్ల మండల యువజన మాజీ అధ్యక్షుడు మధ్యల శ్రీనివాస్ సినిమా బృందం, వివేకానంద కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.