calender_icon.png 8 August, 2025 | 1:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల విద్యార్థినికి ఉత్తమ పురస్కారం

07-08-2025 10:52:06 PM

అభినందించిన కలెక్టర్ ఆదర్శ్ సురభి..

కొత్తకోట: కొత్తకోట మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల విద్యార్థిని పల్లెపాగ సౌమ్యకు ఉత్తమ పురస్కారం లభించింది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కొత్తకోట గురుకుల పాఠశాలకు చెందిన ఎనిమిదవ తరగతి విద్యార్థిని సౌమ్య బుధవారం చేనేత కార్మిక అంశాలపై మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh Surabhi) ఆమెను గురువారం అభినందించి పాఠశాల ఉపాధ్యాయురాలు, అధికారులతో కలిసి పురస్కారం అందజేశారు. గత కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ చేతుల మీదుగా కూడా పురస్కారం అందుకున్న పల్లెపాగ సౌమ్యను పలువురు అభినందిస్తున్నారు.