జగిత్యాలలో ఘనంగా రాహుల్ బర్త్‌డే
జగిత్యాల, జూన్ 19 (విజయక్రాంతి): కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ ఆధర్యంలో జగిత్యాలలో ఘనంగా నిర్వహించారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి పట్ట ణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త మోహన్ ఆధర్యంలో బుధవారం ఇందిరాభవన్ లో రాహుల్ గాంధీ జన్మదినం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా తాటిపర్తి విజయలక్ష్మి మాట్లాడుతూ.. దేశంలో నియం త పాలనను అంతమొందించడానికి, కేంద్రంలో, రాష్ర్టంలో కాంగ్రెస్ అధికారంలో తీసుకురావడానికి కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన యోధుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకు లు దేవేందర్‌రెడ్డి, బండ శంకర్, చందా రాధాకిషన్, లక్ష్మణ్ , జీవన్, దామోదర్‌రెడ్డి, జగదీశర్, శేఖర్, అంజన్న, రాజన్న, చంద్రమౌళి, నర్సయ్య, ప్రభాకర్, మధూకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






