వంటింటి చిట్కాలు
07-11-2024 12:00 AM
- తురిమిన కొబ్బరి, జీడిపప్పు ఫ్రిజ్‌లో ఉంచితే పురుగు పట్టదు. తేనె శుభ్రంగా నిల్వ ఉండాలంటే.. మంచి సీసాలో పోసి రెండు, మూడు లవంగాలు దానిలో వెయ్యాలి.
- నాలుగైదు చుక్కల నిమ్మరసం మాత్రమే అవసరమైనప్పుడు కాయను రెండు ముక్కలుగా కొయ్యవద్దు. సూదితో కాయకు రంధ్రం చేసి రసం పిండితే సరిపోతుంది. ఎండు కొబ్బరి సులభంగా తురమాలంటే దానిపై కొద్దిగా నీళ్లు చల్లి ఫ్రిజ్‌లో ఉంచాలి.
- పసుపు, కారం, కరివేపాకు పొడిలాంటివి నిల్వ చేసేటప్పుడు చిటికెడు ఇంగువ కలిపి పేపరు కవర్లలో భద్రం చేస్తే ఏడాదిపాటు నిల్వ ఉంటాయి.




