calender_icon.png 6 December, 2024 | 4:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్క్‌ప్లేస్‌లో హ్యాపీగా!

07-11-2024 12:00:00 AM

ఇష్టమైన ఫుడ్ తిన్నా, ఇష్టమైన డ్రెస్ వేసుకున్నా హ్యాపీగా అనిపించడం లేదా? ఏం చేసినా బోర్‌గా ఫిల్ అవుతున్నారా? ఈ పని చేయడం నాకు అవసరమా? ఇంత రిస్క్ నేను చేయలేను బాబోయ్ అని అనిపిస్తే మాత్రం.. మీరు కచ్చితంగా మానసికంగా ఒత్తిడికి గురవుతున్నట్లే అంటున్నాయి నిపుణులు. మెంటల్ స్రెస్ నుంచి బయటపడాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి.. 

క్రమశిక్షణ: ఒత్తిడిని తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది క్రమశిక్షణ. దీనికోసం ప్రతిరోజు సరైనా ప్రణాళిక తప్పని సరి అంటున్నారు మానసిక నిపుణులు. ఇలా చేస్తే కొంతవరకు మానసికంగా ప్రశాంతంగా లభిస్తుందని చెబుతున్నారు. 

స్నేహితులతో గడపడం: మీకు ఇష్టమైన వారితో కాసేపు మాట్లాడండి. బెస్ట్ ఫ్రెండ్స్‌తో కాస్త సమయం గడపండి. వక్తిగత విషయాల గురించి ఓపెన్‌గా మాట్లాడండి.. ఇలా చేస్తే మానసికంగా ప్రశాంతత లభించడంతో పాటు ఒత్తిడి మాయం అవుతుంది. 

హాబీస్: కొన్నిసార్లు ఏం తిన్నా.. ఏం చేసినా.. హ్యాప్పీగా అనిపించదు. ఏదో కోల్పోయిన భావన వెంటాడుతుంది. అలా కాకుండా ఉండాలంటే మీకు ఇష్టమైన అభిరుచికి తగినట్లుగా, మీకు సంతృప్తిని కలిగించే పనులు మాత్రమే చేయండి.

ప్లాన్ ప్రకారం: రోజువారీ, వారం, నెలవారిగా చేయాల్సిన పనులను ఒక కాగితంపై రాసుకోండి. దాన్ని మీ టైమ్ టేబుల్‌పై అతికించుకోండి. ప్రారం భంలో కొంత కష్టంగా అనిపించొచ్చు. ఆ తర్వాత అదే అలవాటైపోతుంది. 

బ్రేక్ తీసుకోండి: తరుచుగా బ్రేక్ తీసుకోవాలి. పని మధ్యలో కొంచెం విరామం చాలా అవసరం. ఇది పనిలో ఒత్తిడి తగ్గించడంతో పాటు కాస్త మైండ్‌కు రిలాక్స్‌ను అందిస్తుంది. దాంతో పాటు పోషకాహారం, వ్యాయామంపై కూడా దృష్టి పెట్టాలి.

ప్రొఫెషనల్ సాయం: ఉద్యోగం చేసే చోట అవసరమైతే వృత్తిపరమైన సాయాన్ని తీసుకోండి. సమస్యలతో ఒంటరిగా పోరాటం చేయాల్సిన పనిలేదు. 

వర్క్ ప్లేస్‌లో: పని చేసేచోటు ఆనందంగా, ఆహ్లాదంగా ఉండేలా చూసుకోవాలి. బెటర్ వర్క్ ప్లేస్ చాలా ముఖ్యం. మంచి పని నిర్వహణకు దోహదపడుతుంది. అలాగే ఒత్తిడిని దూరం చేయడంలో సాయపడుతుంది. 

ఫ్యామిలీ టైమ్: వృత్తిపరమైన టార్గెట్ల కారణంగా కుటుంబాన్ని దూరం పెట్టొద్దు. కుటుంబసభ్యులతో కాసేపు గడపటం ముఖ్యం. ఎందుకు పని చేస్తున్నారు.. మీ లక్ష్యాలు, ప్రాధాన్యతలు వారు కూడా గ్రహించాలి. ఎంతపని ఒత్తిడి ఉన్నా కుటుంబాన్ని దూరం పెట్టొద్దని మానసిక నిపుణులు చెబుతున్నారు.