calender_icon.png 30 July, 2025 | 7:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిచెన్ టిప్స్

29-06-2025 12:00:00 AM

బిర్యానీ, పలావ్ వంటివి అండుగంటి వాసన వస్తుంటే.. ఒక ఉల్లిపాయను నాలుగు ముక్కలుగా కోసి వండిన గిన్నెలోని మూలల్లో ఉంచాలి. పావుగంట తర్వాత ఆ ముక్కలు తీసేస్తే మాడు వాసన చాలా వరకు తగ్గుతుంది.

మాడిపోయిన కూరలు, ఇతర ఆహార పదార్థాలపై దాల్చినచెక్క పొడిని చల్లితే మాడు వాసన పోయి మంచి రుచి వస్తుంది.

కూరలు, గ్రేవీ మాడినట్లు గుర్తిస్తే వాటిలో వెన్న, పెరుగు కలిపితే వాసన రాకుండా ఉంటుంది.

కూర అడుగంటి మాడు వాసన వస్తే వాటిలో నిమ్మ, వెనిగర్, టమాటా రసాల్లో ఏదో ఒకటి కొద్దిగా వేసి కలిపితే వాసనపోయి అదనపు రుచి వస్తుంది.