calender_icon.png 15 January, 2026 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పతంగుల పోటీలు.. కెవ్వు కేక!

15-01-2026 02:22:56 AM

  1. ఆకట్టుకుంటున్న స్వీట్ స్టాళ్లు

దేశవిదేశాల నుంచి పాల్గొన్న పలువురు ప్రముఖులు

సికింద్రాబాద్ జనవరి14(విజయక్రాంతి): సంక్రాంతి పండుగ సందర్బంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కైట్ స్వీట్స్ ఫెస్టివల్  బుధవారం ఆద్యాంతం అత్యంత ఆసక్తికరంగా కొనసాగింది. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ కైట్ ఫ్లయర్స్  ఎగురవేస్తున్న భారీ గాలిపటాలతో మైదానం రంగులమయంగా మారింది.

ఈ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్లో పోర్చు గల్, కెనడా, కంబోడియా, ఆస్ట్రేలియా, పోలండ్, శ్రీలంక, ఫ్రాన్స్, ఇండోనేషియా, జపాన్, ఇటలీ, వియత్నామ్,  కొరియా, సింగపూర్, థాయ్ లాండ్, ఉక్రేయిన్ దేశాలతో పాటు తెలంగాణ, ఏపీ, గుజరాత్, మంగుళూర్, మహరాష్ట్ర, చండీఘర్ రాష్ట్రాలకు చెందిన కైట్ ప్లయర్లు ఈ పోటీల లో పతంగులు ఎగురవేస్తూ తమ ప్రతిభా పాటవాలను చాటారు. కైట్ ప్రేక్షకులు కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేశారు.