3 July, 2026 | 11:33 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

బండయప్ప మఠం ఎంతో పవిత్రమైనది

15-01-2026 02:17 AM
  1. మఠాధిపతి సోమయప్ప స్వామి కాంగ్రెస్ భవనంగా మార్చారు

రాజకీయాల్లో రావాలనుకుంటే ప్రత్యక్షంగా రావాలని, పరోక్షమైన రాజకీయాలు చేయవద్దన్నారు

మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే

మద్నూర్, జనవరి 14 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణ కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ పనులు జరగకపోవడం, అధికారుల నిర్లక్ష్యం మూలాన ప్రజలు,వాహనదారులు ఇబ్బందులు పడుతుండడంతో బిఆర్‌ఎస్ మాజీ శాసనసభ్యులు హనుమంతు షిండే ఆధ్వర్యంలో రోడ్డుపై ముగ్గులు వేసి నిరసనని తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంజూరైన సెంట్రల్ లైటింగ్ పనులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయినా పూర్తి చేయకపోవడం సిగ్గుచేటని, వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్న కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వివరించడంపై మండిపడ్డారు.

గతంలో బిచ్కుంద యువకులు నిరసన కార్యక్రమాన్ని చేపడితే వారి పైన కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమని సూటిగా ప్రశ్నించారు, ప్రశ్నిస్తే కేసులు చేయడం మానుకోవా లని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు హితువు పలికారు. బండయప్ప మఠం ఎంతో పవిత్రమైనదని దానికి ఇప్పుడున్న మఠాధిపతి సోమయప్ప స్వామి కాంగ్రెస్ భవనంగా మార్చాలని దుయ్యబట్టారు.

రాజకీయాల్లో రావాలనుకుంటే ప్రత్యక్షంగా రావాలని, పరోక్షమైన రాజకీయాలు చేయవద్దని ప్రత్యక్షంగా వస్తే తాడోపేడో తేల్చుకుందాం అని అన్నారు. రోడ్డు పనులు జరగకపోతే నిరసనని ఉదృతం చేస్తామని హనుమంతు సిందే హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ నలచారి బాలాజీ, శ్రీనివాస్, ఎన్ శ్రీనివాస్, యాదవ్, హాజీ లక్ష్మణ్, డాక్టర్ రాజు, పిట్ల సాయికుమార్, దర్పల అశోక్, చాకలి విట్టల్, అవర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.