13 April, 2026 | 5:03 PM

రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలకు ఎంపికైన కిట్స్ విద్యార్థినులు

18-02-2026 07:47 PM

కోదాడ,(విజయక్రాంతి): కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు  కరాటే లో రాష్ట్ర స్థాయి సిఎం కప్ పోటీలకు ఎంపిక అయినట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ బుధవారం తెలిపారు. సూర్యాపేట లో నిర్వహించిన కరాటే ఛాంపియన్షిప్ పోటీలో సీనియర్ విభాగంలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న ఎం. వైభవి  బంగారు పతకం, జూనియర్ స్థాయిలో డిప్లొమా రెండవ సంవత్సరం చదువుతున్న దీపిక బంగారు పతకం సాధించారు.

జూనియర్  విభాగంలో  జె. రవళి, ఎం. అంజలి, దీపిక వెండి పతకాలు సాధించినట్టు తెలిపారు. విద్యార్థినులను కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ చరవాణి ద్వారా అభినందించారు. ఈ కార్యక్రమం లో  కళాశాల డైరెక్టర్ డాక్టర్ నాగార్జున రావు,  అధ్యాపకులు, కరాటే శిక్షకులు మాధవి లత అభినందించారు.