న్యూ నాగోల్లో సోలిటైర్ జిమ్
ప్రారంభించిన యాంకర్ స్రవంతి
నాగోల్, ఆగస్టు 10 (విజయక్రాంతి): కొత్తపేట డివిజన్ పరిధిలోని న్యూ నాగోల్లో సోలిటైర్ ఫిట్నెస్ సంస్థను సోలిటైర్ జిమ్గా విస్తరించి సోమవారం ప్రారంభించారు. ప్రము ఖ యాంకర్ స్రవంతి చుక్కారపు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు మీర్ ముర్తాజా అలీ మాట్లాడుతూ, ఆధునిక పరికరాలు, నిపుణుల శిక్షణతో ఫిట్నెస్ సేవలను అందించేందుకు సోలిటైర్ జిమ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రజలకు మెరుగైన వ్యాయామ వాతావరణాన్ని కల్పించడమే తమ లక్ష్యమన్నారు. యాంకర్ స్రవంతి మాట్లాడుతూ, నిత్య జీవితంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ఎంతో అవసరమని, ఫిట్నెస్ను ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ ధనియాలు ముర్తాజా అలీ, సీటీఓ డైరెక్టర్ సులేమాన్ ముర్తాజా అలీ, జిమ్ సిబ్బంది, ఫిట్నెస్ ఔత్సాహికులు, స్థానికులు పాల్గొన్నారు.






