7 May, 2026 | 5:38 AM

కొక్కొరొకో.. ప్రారంభమైందహో!

01-09-2025 12:00 AM

ప్రముఖ దర్శక, నిర్మాత రమేశ్‌వర్మ కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకుగానూ ‘ఆర్వీ ఫిల్మ్ హౌస్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ బ్యానర్ మీద నిర్మిస్తున్న మొదటి ప్రాజెక్ట్ ‘కొక్కొరొకో’ని ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముహూర్తపు షాట్‌కు నిర్మాత రేఖ వర్మ క్లాప్ కొట్టగా.. నిర్మాత కూరపాటి శిరీష కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

రమేశ్‌వర్మ స్క్రిప్టును దర్శకుడు శ్రీనివాస్ వసంతలకు అందజేశారు. ఈ మూవీతో శ్రీనివాస్ వసంతల దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. వినూత్నమైన కథతో, డిఫరెంట్ ఎక్స్పీరియెన్స్ అందించేలా శ్రీనివాస్ వసంతల ఈ మూవీని తెరకెక్కించనున్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సోదరుడు ప్రముఖ నేపథ్య గాయకుడు జివి సాగర్ ఈ మూవీకి సంభాషణలు రాసే బాధ్యత ను స్వీకరించారు.

తన తండ్రి వారసత్వాన్ని అనుసరించి ‘రాక్షసుడు’ తర్వాత రచయితగా రెండో ప్రాజెక్ట్‌కి సాగర్ చేపట్టా రు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా ఆకాశ్ ఆర్ జోషి, లండన్‌కు చెందిన ఒక యంగ్ అండ్ ఎనర్జిటిక్ మ్యూజిక్ డైరెక్టర్‌గా సంకీర్తన్ పనిచేయనున్నారు.

ఈ చిత్రాన్ని రేఖ వర్మ, కూరపాటి శిరీష నిర్మాతలుగా.. నీల్లాద్రి ప్రొడక్షన్ కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎడిటర్‌గా ప్రవీణ్ పూడి, కథ, స్క్రీన్ ప్లేను రమేశ్ వర్మ. ఆర్వి ఫిల్మ్ హౌస్ బ్యానర్‌లో మొదటి చిత్రంగా తెలుగులో అద్భుతమైన విజువల్స్, మంచి ఎమోషన్స్‌లో రూపొందనున్న ‘కొక్కొరొకో’ సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.