30 May, 2026 | 11:26 PM

Breaking News

ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు   •   ఖాతాదారుల సేవా కేంద్రం నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం   •   గిరిజన యువతీ యువకులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం   •   మండల టాపర్‌ మేకా మాన్వితకు ట్రిపుల్ ఐటీ సీటు   •   పెద్దమల్లారెడ్డిలో అగ్నిప్రమాదం.. గడ్డివాము, ట్రాక్టర్ దగ్ధం   •   వరికొయ్యలు కాల్చవద్దు... బహిరంగ వ్యర్ధాలు కాల్చవద్దు   •   కూచిపూడి నృత్యంతో అలరించిన మోక్ష ధృతి   •   అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులను చేర్పించాలి: సీడీపీవో జ్యోతి   •   ఘట్కేసర్ లో ప్రారంభమైన సిపిఎం శిక్షణ తరగతులు   •   రైతు డిస్కమ్ రైతాంగానికి శాపం   •  

మళ్లీ ఓటమి షాక్! కేకేఆర్ ఎందుకు కుప్పకూలుతోంది?

15-04-2026 01:20 AM

చెన్నై సూపర్‌కింగ్స్‌పై ఓటమి

నిరాశపరిచిన కేకేఆర్ బ్యాటర్లు

నూర్ అహ్మద్ స్పిన్ మ్యాజిక్

ఐపీఎల్ 19వ సీజన్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ తీరు మారలేదు. సీజన్ మొదలై మూడు వారాలైనా కేకేఆర్ ఇప్పటి వరకూ గెలుపు ఖాతా తెరవనే లేదు. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన వేళ ఛేజింగ్‌లో కోల్ కతా చేతులెత్తేసింది. ఫలితంగా మరో ఓటమిని చవిచూసింది. అటు గత మ్యాచ్‌తో పుంజుకున్న సీఎస్కే అదే జోరు కొనసాగిస్తోంది. 

చెన్నై , ఏప్రిల్ 14 : చెన్నై సూపర్ కింగ్స్ ట్రాక్ లో పడినట్టే కనిపిస్తోంది. ఆరంభంలో వరుస పరాజయాలతో సతమతమైన సీఎ స్కే ఇప్పుడు గెలుపు బాటలో దూసుకెళుతోంది. తాజాగా IPL 2026లో కోల్ కతా నైట్ రైడర్స్ పై 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్ కతా నైట్ రైడర్స్ చెన్నైని తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో విఫలమైంది.

ఇంకా తాజా IPL 2026 మ్యాచ్ రిపోర్ట్స్, పాయింట్స్ టేబుల్ అప్‌డేట్స్ కోసం మా Sports కేటగిరీని సందర్శించండి.

ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ నిరాశప రిచినా సంజూ శాంసన్ తన ఫామ్ కొనసాగించాడు. మరో బ్యాటర్ ఆయుశ్ మాత్రేతో కలిసి దూకుడుగా ఆడాడు. రెండో వికెట్ కు 47 పరుగులు జోడించాడు. ముఖ్యంగా ఆయుశ్ మాత్రే విధ్వంసం సృష్టించాడు. కేవలం 17 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేయగా.. సంజూ 48 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత బ్రెవిస్, సర్ఫరాజ్ ఖాన్ ధాటిగా ఆడుతూ స్కోర్ పెంచారు.

వీరిద్దరూ కేవలం 29 బంతుల్లోనే 51 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు. బ్రెవిస్ 29 బంతుల్లో 41 (4 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేయగా.. సర్ఫరాజ్ 23, దూబే 13, ఓవర్టన్ 7 పరుగులు చేశారు. అయితే చివరి ఓవర్లలో కోల్ కతా బౌలర్లు చెన్నై బ్యాటర్ల జోరుకు కళ్లెం వేశారు. ఫలితంగా చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో కార్తీక్ త్యాగి 2, అంకుల్ రాయ్, నరైన్ , వైభవ్ అరోరా ఒక్కో వికెట్ తీశారు.

తర్వాత ఛేజింగ్ లో కోల్ కతా నైట్ రైడ ర్స్ చేతులెత్తేసింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన ఓపెనర్ ఫిన్ అలెన్ మళ్లీ నిరాశపరిచాడు. సునీల్ నరైన్ క్రీజులో ఉన్న కొద్దిసేపు భారీ షాట్లతో అలరించాడు. 17 బంతుల్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లతో  24 రన్స్ కు ఔటయ్యాడు. ఈ దశలో రహానే, రఘువంశీ ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో మూడో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ ఔటైన తర్వాత సాధిం చాల్సిన రన్ రేట్ పెరుగుతూ వచ్చింది.

రింకూ సింగ్(6), కామెరూన్ గ్రీన్ డకౌటయ్యాడు. దాదాపుగా అక్కడే కోల్ కతా ఓటమి ఖాయమైంది. అయితే పావెల్, రమణ్ దీప్ సింగ్ ధాటిగా ఆడడంతో ఏదైనా అద్భు తం జరుగుతుందేమో అనిపించింది. అయి తే అన్షుల్ కాంబోజ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో అలాంటిదేమీ సాధ్యపడలేదు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 160 పరుగులే చేయగలిగింది. సీఎస్కే స్పిన్నర్ నూర్ అహ్మద్ 3 కీలక వికెట్లతో కేకేఆర్ ను దెబ్బ కొట్టాడు. ఈ సీజన్‌లో కేకేఆర్ కు ఇది నాలుగో ఓటమి, అటు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇది రెండో విజయం.

స్కోరు బోర్డు 

చెన్నై సూపర్‌కింగ్స్: 192/5, సంజూ శాంసన్ 48,బ్రెవిస్ 41, ఆయుశ్ మాత్రే 38, సర్ఫరాజ్ ఖాన్  23; కార్తీక్ త్యాగి 2/35, అంకుల్ రాయ్1/21)

కోల్‌కతా నైట్‌రైడర్స్: 160/7(రమణ్‌దీప్ 35, పావెల్ 31, రహనే 28 ; నూర్ అహ్మద్ 3/21, అన్షుల్ కాంబోజ్ 2/31)