27 April, 2026 | 3:36 AM

కోల్‌కతా సూపర్ విక్టరీ

27-04-2026 01:48 AM

ఉత్కంఠతో ఊపేసిన మ్యాచ్

సిక్సర్‌తో టై చేసిన షమీ

సూపర్ ఓవర్‌లో గెలిచిన కేకేఆర్

క్రికెట్ ఫ్యాన్స్‌కు అసలు సిసలు మజా.. ఆదివారం లక్నో, కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్ ఉత్కంఠతో ఊపేసింది. అసలు గెలుపుపై ఆశలు లేని ఇరు జట్ల మధ్య జరిగిన ఈ పోరు సూపర్ ఓవర్‌కు దారితీసింది. ఈజీగా గెలిచే మ్యాచ్‌లో త్యాగి వేసిన రెండు నోబాల్స్ కేకేఆర్ కొంపముంచితే... ఆఖరి బంతికి సిక్స్ కొట్టి టై చేసిన షమీ పోరాటం వృథా అయింది. సూపర్ ఓవర్‌లో లక్నో ఓడిపోయింది. మొత్తం మీద సూపర్ సండే రోజున ఐపీఎల్ అభిమానులను సూపర్ వినోదం దక్కింది.

లక్నో, ఏప్రిల్ 26 : ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. గత మ్యా చ్ విజయంతో ఉత్సాహంగా బ్యాటింగ్‌కు దిగిన కోల్ కతాకు లక్నో పేసర్ మోసిన్ ఖాన్ దిమ్మతిరిగే షాకిచ్చాడు. టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. రహానే (10), పావెల్ (1), సిఫర్ట్ (0), రఘువంశీ (అబ్‌స్ట్రక్టింగ్ ఫీల్ ) ఔటయ్యారు. ఫలితంగా కేకేఆర్ కేవ లం 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కేకేఆర్ను రింకూ తన విరోచిత హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు.

ఓ దశలో ఆచితూచి ఆడిన రింకూ.. చివరి రెండు ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మహ్మద్ షమీ వేసిన 19 ఓ వర్లో 17 పరుగులు రాబట్టిన రింకూ సింగ్.. ఆ తర్వా త ఆఖరి ఓవర్లో స్పిన్నర్ దిగ్వేష్ రాఠీని ఓ ఆడుకున్నా డు. ఆ ఓవర్లో రింకూ వరుసగా నాలుగు సిక్స్లు బాది 26 పరుగులు పిండుకున్నాడు. మరో రెండు పరు గులు వైడ్స్ రూపంలో వచ్చాయి. కేవలం 51 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రింకూ సింగ్.. 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు.

అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.  మొసిన్ ఖాన్ తన నాలుగు ఓవర్లలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో లిండే ఓ వికెట్ సాధించారు. తర్వాత ఛేజింగ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఆరంభం నుంచే తడబడింది.

మిఛెల్ మార్ష్, పూరన్, ముకుల్ చౌదరి నిరాశపరిచారు. అయితే రిషబ్ పంత్, మార్క్ రమ్ ఆదుకోవడంతో లక్నో గెలిచేలా కనిపించింది. వీరిద్దరూ కీలక సమయంలో ఔటవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. చివర్లో ఆయుశ్ బదోనీ (24) హిమ్మత్ సింగ్ (19) పరుగులు చేసి ఔటవడంతో ఉత్కంఠ పెరిగిపోయింది.

ఆఖ రి ఓవర్లో కేకేఆర్ పేసర్ త్యాగీ  రెండు నోబా ల్స్ వేసి కొంపముంచాడు. చివరి బంతికి షమీ సిక్సర్ కొట్టడంతో స్కోర్లు సమమయ్యాయి. దీంతో ఫలితం కోసం సూపర్ ఓవర్ తప్పలేదు. సూపర్ ఓవర్లో తొలి బంతి కే సునీల్ నరైన్ అద్భుతమైన బంతితో పూరన్‌ను బౌల్ చేశాడు. తర్వాత పంత్ సిం గిల్ తీయగా.. మూడో బంతికి మార్క రమ్ ఔటవడంతో లక్నో ఇన్నింగ్స్ 1 పరుగుకే ముగిసింది. అనంతరం రింకూ సింగ్ ఫోర్ కొట్టి కోల్ కతాను గెలిపించాడు. 

స్కోరు బోర్డు 

కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ : 155/7 ( రింకూ సింగ్ 83, గ్రీన్ 34, రహానే 10, మోసిన్ ఖాన్ 5/23, లిండే 1/18)

లక్నో సూపర్‌జెయింట్స్ ఇన్నింగ్స్ : 155/8 ( పంత్ 42. మార్కరమ్ 31, బదోనీ 24, వైభవ్ అరోరా 2/24, వరుణ్ చక్రవర్తి 2/33)

సూపర్ ఓవర్

కోల్‌కతా నైట్‌రైడర్స్  : 1/2

లక్నో సూపర్‌జెయిట్స్ : 4/0