calender_icon.png 2 November, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ వలలో కొండాపూర్ పంచాయతీ కార్యదర్శి

27-09-2024 07:43:59 PM

సంగారెడ్డి,(విజయక్రాంతి): గృహ అనుమతులకు ఆన్లైన్ చేసేందుకు డబ్బులు డిమాండ్ చేసిన కొండాపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి మహమ్మద్ షకీల్ ఏసీబీ అధికారుల వలలో చిక్కాడు. నివాస ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి ఆన్లైన్ చేయడానికి కార్యదర్శిని సంప్రదించగా 5000 వేలు డిమాండ్ చేశాడు. పని ఆలస్యం కావడంతో బాధితుడు ఆన్సర్  మరోసారి కలిశాడు. చివరికి 5వేలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయం బాధితుడు కొన్ని రోజుల కిందట ఏసీబీ అధికారులకు తెలియజేశారు. కార్యదర్శి మహమ్మద్ షకీల్ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్  గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.