కోళ్ల పందెం స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
పోలీసుల అదుపులో 9 మంది పందెం రాయళ్ళు
కొన్ని పందెం కోళ్ళు స్వాధీనం
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): కోళ్ల పందెం ఆడుతున్న స్థావరంపై నాగర్ కర్నూల్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. 9 మంది పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకొని ఆరు పందెం కోళ్లను స్వాధీనపరచుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని చందాయిపల్లి గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని చందాయిపల్లి గ్రామ శివారులోని పంట పొలాల్లో కోళ్ల పందెం ఆడుతున్న స్థావరంపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించి కోళ్ల పందెం ఆడుతున్న పందెం రాయుళ్ళతో పాటు ఆరు పందెం కోళ్ళు, పదునైన కత్తులతో పాటు కొంత నగదు వాహనాలు కూడా సీజ్ చేసినట్లు తెలిసింది. దీనిపై పోలీసులు ఇంకా పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.






