17 April, 2026 | 7:06 PM

నగరానికి మణిహారంగా కొరిటిపాడు వాకింగ్ ట్రాక్

04-06-2025 01:25 AM

వాకింగ్ ట్రాక్ అధ్యక్షుడు కన్నసాని బాజీ 

గుంటూరు, జూన్ 3 (విజయక్రాంతి): కొరిటిపాడు వాకింగ్ ట్రాక్‌ని అభివృద్ధి పరి చి నగరానికి మణిహారంగా అందించటమే ధ్యేయమని వాకింగ్ ట్రాక్ అధ్యక్షుడు కన్నసాని బాజీ తెలిపారు. మంగళవారం ట్రాక్ అభివృద్ధిలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే గళ్లా మాధవిని కలిసినట్టు తెలిపారు. వెంటనే స్పందించిన ఆమె వాకింగ్ ట్రాక్ సభ్యత్వం నమోదు చేయించుకున్నారని తెలిపారు.

అంతేకాకుండా వాకింగ్ ట్రాక్‌లో కోటి రూ పాయలతో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారని తెలిపారు. అభివృద్ధిలో రాజీ పడకుండా ట్రాక్‌ను నగరానికే మణిహారంగా తీర్చేదిద్దాలని ఎమ్మెల్యే చెప్పినట్లు పేర్కొన్నారు.

నగర మేయర్ కోవెలమూడి రవీంద్రని కూడా కలిసినట్టు తెలి పారు. వాకింగ్ ట్రాక్ నందు జరుగుతున్న అభివృద్ధి గురించి వివరించడంతో ట్రాక్ సభ్యత్వం నమోదు చేసుకున్నారని తెలిపా రు. ట్రాక్‌కు సంబంధించి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపినట్లు కన్నసాని బాజీ తెలిపారు.