calender_icon.png 2 February, 2026 | 6:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయుల సేవలు చిరస్మరణీయం

01-02-2026 12:04:40 AM

ఘనంగా మేడా ఆశీర్వాదం, గౌసుద్దీన్ పదవీ విరమణ

సికింద్రాబాద్ జనవరి 31 (విజయక్రాంతి): బోయిన్‌పల్లి బాపూజీ నగర్ ప్రాధ మిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జాతీ య ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మేడా ఆశీర్వాదం పదవి విరమణ చేస్తున్న సందర్భంగా వారు విధులు నిర్వహిస్తున్న పాఠశాలలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే,డిసిపి మధుకర్ స్వామి,బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్, ఉపాధ్యాయులు, విద్యార్ధినీ, విద్యార్ధుల సమక్షంలో మేడా ఆశీర్వా దం దంపతులను శాలువతో ఘనంగా సన్మానించారు. వారు గత 38 సంవత్సరాలుగా చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

న్యూ బోయినపల్లి ప్రభుత్వ బాలుర ప్రాధమిక ఉన్నత పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు గౌసుద్దీన్ పదవి విరమణ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపా ధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిధిగా హాజరై శాలువా కప్పి పుష్పగుచ్చం అం దజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ విద్యా ర్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది వారి జీవితానికి బంగారు బాటలు వేసిన గౌసుద్దీన్ అన్నారు.