15 April, 2026 | 1:54 PM

Breaking News

పేకాట ఆడుతున్నారనే నెపంతో ఎస్ఐ దాడి... పోలీస్ స్టేషన్ ఎదుట 100 మంది ధర్నా   •   ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •  

పేద ప్రజల ఆపద్బాంధవుడు దుద్దిళ్ల శ్రీనుబాబు

14-06-2025 04:15 PM

మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ 

మంథని(విజయక్రాంతి): పేద ప్రజల ఆపద్బాంధవుడు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు అని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియామకమైన సందర్భంగా హైదరాబాద్ లోని వారి కార్యాలయంలో  చైర్మన్ కొత్త శ్రీనివాస్  మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసినారు.

ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్  మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేయడంతో పాటు నిత్యం పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి ఆరోగ్య,ఇతర  అవసరాలను తీరుస్తున్న శ్రీనుబాబు చేస్తున్న సేవలను కాంగ్రెస్ పార్టీ గుర్తించి  రాష్ట్ర నాయకత్వంలో చోటు కల్పించిందని అన్నారు. కాంగ్రెస్  పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తూ ముందుకు సాగాలని కోరారు. రాబోయే రోజుల్లో దుద్దిళ్ల కుటుంబం మరెన్నో గొప్ప పదవులు అధిరోహించాలని  కోరుకున్నారు. ఆయన వెంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు పేరవేన లింగయ్య యాదవ్, తదితరులు ఉన్నారు.