calender_icon.png 21 January, 2026 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి

21-01-2026 04:00:17 PM

కుమ్రంభీం అసిఫాబాద్,(విజయక్రాంతి): ఇటీవల ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి  బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి బుధవారం జిల్లా ఎస్పీ నితిక పంత్ కి ఫిర్యాదు చేశారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ద్వేషాన్ని, బెదిరింపులను ప్రోత్సహించే వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు బుర్స పోచయ్య, చూనార్కర్ సతీష్, ఉప సర్పంచ్ మామిడి లక్ష్మి, నాయకులు మర్సకోల సరస్వతి,  అహ్మద్, చిలువేరు వెంకన్న, అలిబిన్ అహ్మద్,పొన్నాల నారాయణ, నిస్సార్, గంధం శ్రీనివాస్, దూడల అశోక్, గోపాల్, జావీద్, అన్సార్, సీహెచ్. రవి, సాయి శ్రవణ్, సల్మాన్ , శంకర్ , సతీష్, తుకారాం, రాకేష్, ధర్మారావు, కిషన్ తదితరులు పాల్గొన్నారు.