21-01-2026 04:03:28 PM
ఎమ్మెల్యే కోవ లక్ష్మి
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రజా సమస్యలు వెలికితీయడంలో పత్రికలు ముందుండాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. బుధవారం తన నివాసంలో విజయ క్రాంతి దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను స్టాఫ్ రిపోర్టర్ చిప్ప సురేష్, బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... అనతి కాలంలోనే విజయ క్రాంతి దినపత్రిక ప్రజల మన్ననలు పొందిందన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలతో పాటు అన్ని వర్గాల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చొరవ చూపడం అభినందనీయమని తెలిపారు. జర్నలిజం అన్ని రంగాలపై దృష్టి సారించి ప్రజల పక్షాన నిలబడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వాంకిడి రిపోర్టర్ రహీద్ పాషా, సింగిల్ విండో మాజీ చైర్మన్ అలీబిన్ హైమద్, రాజంపేట సర్పంచ్ పోచయ్య, వాంకిడి సర్పంచ్ సతీష్, నాయకులు జీవన్, అయుబ్, తుకారం, పొన్నాల నారాయణ తదితరులు పాల్గొన్నారు.