13 June, 2026 | 10:42 PM

జాతీయ సెమినార్ లో కోయగూడెం వాసికి సన్మానం

13-06-2026 09:20 PM

బూర్గంపాడు,జూన్ 13(విజయక్రాంతి): హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో సమ్మక్క సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నిర్వహించిన 'గిరిజన జీవితం, సాంప్రదాయాలు, గతానుభవాలు, అంతర్గుష్టులు, దూరదృష్టి' అంశంపై 12, 13 తేదీల్లో రెండు రోజుల సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్కు మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్, సమక్క సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీనివాస్, ద్రావిడ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుబ్బయ్య చారిలు హాజరయ్యారు. ఈ సెమినార్లో బూర్గంపాడు మండల పరిధిలోని కోయగూడెంకు చెందిన ట్రైబల్ రీసెర్చ్ ఫెలోవ్ పాయం రాజేంద్రప్రసాద్ పాల్గొని 'కోయ గిరిజనుల ప్రాచీన ఆహారపు అలవాట్లు' అంశంపై రాసిన వ్యాసాన్ని సమర్పించారు. ఈ సెమినార్లో ఆ వ్యాసం పలువురు ప్రముఖుల నుంచి అభినందనలు అందుకోగా రాజేంద్రప్రసాద్ను శాలువాతో సత్కరించి ప్రశంసాపత్రం అందజేశారు.