15 August, 2026 | 6:35 PM

వయనాడ్ తో నా బంధం కొనసాగుతోంది: రాహుల్ గాంధీ

17-06-2024 08:07 PM

న్యూఢిల్లీ : లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేసిన కేరళలోని వయనాడ్, యూపీలోని రాయ్ బరేలీ రెండింటిలోనూ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. నియమాల ప్రకారం ఒకే వ్యక్తి రెండు స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహించకూడదు. ఈ నేపథ్యంలో ఆయన వయనాడ్ ఎంపీ సీటును వదులుకోనున్నట్లు ప్రకటించారు. రాయ్ బరేలీ ఎంపీగా కొనసాగనున్నారు. 

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ... వయనాడ్ ను తను వదులుకున్న ఆ ప్రాంతంతో తన బంధం కొనసాగుతుందని తెలిపారు. రెండింటిలో దేన్ని వదులుకోవాలనే విషయంలో చాలా మధనపడ్డాన్నాని చెప్పారుఇకపైనా తరచూగా వయనాడ్ ను సందర్శిస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ స్థానంలో ప్రియాంక గాంధీను రంగంలోకి దించింది. ఆమె తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.