వైకుంఠం చేర్చే మార్గం ఇవ్వు కృష్ణా!
మాడభూషి శ్రీధర్ :
నాయగన్ ఆయ్ నిన్ఱ= మాకందరికీ నాయకుడైన, నందగోపన్ ఉడై య= నందగోపుని, కోయిల్= భవనాన్ని, కాప్పానే!= కాపాడే వా డా, కొడిత్తోన్ఱుం= ప్రకాశించే ధ్వజాలతో, తోరణవాశల్= తోరణాలతో అలంకరించిన ద్వారా న్ని, కాప్పానే= కాపాడేవాడా, మణిక్కదవం= మణులతో తాపడం చేసిన తలుపులు, తాళ్= గడియను, తిఱవా య్= తీయవలెను, ఆయర్ శిఱుమియరోముక్కు= గోపబాలికలమైన మాకు, అఱై పఱై= మ్రోగే పరై అనే వాయిద్యాన్ని, మాయన్= ఆశ్చర్యకరమైన మాయలు చేసినవాడు, మణివణ్ణన్= నీలమణుల వంటి మేనిఛాయ గలవాడు, నెన్నలే= నిన్ననే, వాయ్-నేరుందాన్= వాగ్దానం చేశాడు, తూయోమా య్ వందోం= పరిశుద్ధులమై వచ్చినాము, తు యిలెర ప్పాడువాన్= మేలు కొల్పడానికి వ చ్చాము, వాయాల్= నీ నోటితో, మున్నం ము న్నం= ముందే కాదనకమ్మా, మాత్తాదే అమ్మా నీ నేశనిలైక్కదమ్= శ్రీకృష్ణునిపై ప్రేమాభిమానాలతో నిండిన తలుపును, నీక్కు= తెరువుము.
ఈ పాశురంలో ఆండాళ్ తల్లి మనల్ని ఆచార్య భవనానికి తీసుకెళ్తున్నది. తోరణం ధ్వజం కట్టి ఉన్న నందగోప భవనాన్ని అసురుల ఆపదలనుంచి కాపాడుకోవడమే కాపలా వారి పని. గోపికలు రాగానే కాపలాదారులు అప్రమత్నమైనారు. గోదమ్మ వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మా నా యకుడైన నందగోపుని దివ్యభవనాన్ని రక్షించేవాడా, మణిమయ ద్వారాన్ని తెరువుము.
పర మపదంలోని దివ్యభవనం నుంచి లోకాలను పాలించి, పాలించి విసిగిపోయిన శ్రీహరి నందగోపాలుని ఇంటికి వెళ్లి పరతంత్రుడుగా ఉన్నా డు. తమ కుమారుడిని రాజుగా చూసుకునే భాగ్యం దశరథుడికీ, వసుదేవుడికీ కలగలేదు. ఆ భాగ్యం కేవలం నందుడికే దక్కింది.
సర్వలోకాలకు తండ్రి అయినవాడు తనకు తండ్రి నందగోపుడని సంభావించి, తండ్రి పేరనే భవనాన్ని పిలుచుకుంటున్నాడు. రాముడు వనవాసానంతరం తిరిగి వస్తూ విమానం ద్వారా సీతకు అయోధ్యను చూపించి ‘ఇది నా తండ్రి రాజధాని’ అని చెప్పాడు.
భగవంతుడు ఉండే భవనాన్ని, ఆయన తం డ్రి పేరనున్న దివ్యభవనాన్ని కాపలా కాస్తున్నవాడిని ఆ వృత్తి కర్మబంధాన్ని అనుసరించి సం బోధిస్తున్నారు గోపికలు. భగవత్సంబంధం తెలిపే పేరుతో చేతనుని పిలవడం గౌరవం. కు లాన్నిబట్టి కాక భగవంతుడి సంబంధమే భాగవతులకు ప్రీతిపాత్రం కదా.
మొదట క్షేత్రపాల కుని పేరు చెప్పి ద్వారపాలకుడిని సంబోధిస్తున్నారు. శ్రీకృష్ణుడిని దర్శించాలనే ఆతృతతో అం దరినీ బతిమాలి ఆటంకాలను తొలగించుకుంటున్నారు. రాముని కాపాడాలని సకలదేవత లనూ అయోధ్య ప్రజలు కోరుకునే వారట.
గోకులంలో అన్ని ఇళ్లూ సుసంపన్నంగా నందగోపుని భవనాలవలెనే ఉంటాయట. గోపికలు గుర్తు పట్టడానికి శ్రీకృష్ణుడే ధ్వజాన్ని, తోరణాలను కట్టి ఉంచినాడట. రాముని వెదుక్కుంటూ వెళ్లిన భరతుడు, నారవస్త్రాలతో అల రారుతున్న రామాశ్రమాన్ని గుర్తించి తరించినట్టు గోపికలు ఈ ధ్వజతోరణాలను చూసి ధన్యులైనారట.
అచేతనాలైన ధ్వజాలు, తోరణాలు, ద్వారాలు మమ్ము స్వాగతించలేవు. నీ వు సచేతనుడివి కనుక మా ఆర్తి నీకు అర్థమవుతుంది. లోపలికి అనుమతించు. శ్రీకృష్ణుడి అ నుమతి తీసుకుని సుభద్రను అర్జునుడు తీసుకుపోయినట్టు నీవు మాకు సాయం చేయాలని అంటున్నారు. ఆ భవన మణినిర్మిత ద్వారాన్ని అసమానంగా, అద్భుతంగా తీర్చిదిద్దారు.
రా ముడిని ఆహ్వానించడానికి సుమంతుడు వెళ్లినప్పుడు ఆయన భవన మణిద్వారాన్ని చూసి మైమరిచాడట. ఆ ద్వార సౌందర్యాన్ని చూసి మా కళ్లు చెదిరి పోకముందే మమ్మల్ని లోనికి అనుమతించండి. ఆత్మ స్వరూపం మణికవా టం వంటిదట.
దానికి అబ్బురపడి దాన్నే అనుభవిస్తూ అక్కడే ఉండిపోతారట. కాని పరమాత్మ స్వరూపాన్ని చేరాలంటే ఆత్మసౌందర్యానుభవాన్ని దాటి వెళ్లాలి. ద్వారపాలకుడై నిలబడ్డ ఆచార్యుడే ఆ తలపులు తెరుస్తాడు.






