14 July, 2026 | 4:03 PM

Breaking News

ఫీజు రీయంబర్స్ మెంట్ ను విడుదల చేయాలి   •   సుధాకర్ కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •   తెలంగాణలో SIR గడువు పెంచాలని విజ్ఞప్తి చేశాం: మంత్రి పొన్నం   •   మోదీ, అమిత్ షా స్పందిచరెందుకు?.. 23న మౌనదీక్ష చేస్తా: వీహెచ్   •   కార్మికులకు ఆరోగ్య భరోసా   •   సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వినోద్ బుద్ది మారాలని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పూజలు   •   దుర్గాభవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు   •   అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి   •   చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి   •   ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •  

ప్రేమ కోసం అబ్బాయిలే ప్రాణాలర్పిస్తారా?

22-03-2025 02:32 AM

బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ గురించి పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ మహేశ్ బాబు, సుకుమార్ కాంబోలో వచ్చిన ‘వన్ నేనొక్కడినే’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తరువాత ‘ఆదిపురుష్’ సినిమాలో సీత పాత్రలో మెప్పించింది. ‘వన్’ తరువాత ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌కి షిఫ్ట్ అయిపోయి వరుస సినిమాలు చేస్తోంది. అక్కడ మంచి స్టార్ డమ్ సంపాదించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ధనుష్‌కి జంటగా నటిస్తోంది. వీరిద్దరూ ప్రధాన పాత్రలో ‘తేరే ఇష్క్ మే’ చిత్రం రూపొందుతోంది. ధనుష్, ఆనంద్ కాంబోలో రూపొందుతున్న మూడో చిత్రమిది.

గతంలో వీరిద్దరి కాంబోలో ‘రాంయునా’, అత్రంగీ రే’ సినిమాలొచ్చాయి. ‘తేరే ఇష్క్ మే’ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ 28న హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో కృతి సనన్ షేర్ చేసింది. ‘ప్రేమ కోసం అబ్బాయిలే ప్రాణాలర్పిస్తారా? అమ్మాయిలకూ ఆ ధైర్యం ఉంటుంది’ అంటూ ఫోటోలు షేర్ చేసింది. మరి ఇది సినిమా కాన్సెప్టో.. లేదంటే మరొకటో కానీ ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.