23-03-2025 12:07:51 AM
ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్‌లో ఒకరిగా ఉన్నారు సందీ ప్‌రెడ్డి వంగా. ‘అర్జున్‌రెడ్డి’ చిత్రంతో ఓ సెన్సేషన్ క్రియేట్ చేశారు. ‘యానిమల్’తో పా న్ ఇండియా స్థాయి లో ఆయన పేరు మారుమోగింది. ప్రస్తుతం ఆయన ప్రభాస్‌తో ‘స్పిరిట్’ చేయడానికి సిద్ధ మవుతున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో నటించే నటీనటుల గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు కానీ ప్రభాస్ అన్నగా మాత్రం ఓ స్టార్ హీరో నటించనున్నాడని టాక్.
ఆ స్టార్ హీరో మరెవరో కాదు.. సంజయ్ దత్. మొత్తానికి సందీప్‌రెడ్డి వంగా పెద్ద ప్లానింగ్‌తోనే ఉన్నారు. ఇందులో నిజమెంతో తెలియదు కానీ ఈ వార్త మాత్రం ప్రభాస్ అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది. ఈ సినిమా ఉగాది పండుగ నాడు లాంఛనంగా ప్రారంభం కానుందని సమాచారం. రెగ్యులర్ షూటింగ్‌కి మాత్రం టైం పడుతుందట.