కేటీఆర్, హరీశ్‌కు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం
- అభివృద్ధిని చూసి ఓర్వలేక సీఎంపై గ్లోబల్ ప్రచారం-
- బీఆర్‌ఎస్ పార్టీని ఆస్తిత్వం కోల్పోతున్నామనే భయం వెంటడుతోంది..
- ఏ ఊరికైనా వెళదాం.. అభివృద్ధి ఏంటో చూపిస్తాం.
- ఎంపీ మల్లు రవి
నాగర్‌కర్నూల్ జులై 3 ( విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావులు నిత్యం వార్తల్లో నిలవాలనే ఉద్దేశంతో ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఎం పీ మల్లు రవి విమర్శించారు. శుక్రవారం జి ల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో విద్య, వై ద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత రం గాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బిఆర్‌ఎస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో చేసిన లక్షల కోట్ల అప్పుల భారం ప్రస్తుతం రాష్ట్రంపై ఉందన్నారు. ఆ అప్పులకు వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్ప డిందని పేర్కొన్నారు. రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విసిరిన సవాలకు కేసీఆర్ సమాధానం చెప్పాలన్నా రు. ఏ ఊరికైనా వెళ్దాం.. అభివృద్ధి ఏంటో ప్రజలకు చూపిస్తారని గ్రామాల్లో నిర్మితమైన ఇందిరమ్మ వెళ్లే వాటికి నిదర్శనం అ న్నారు. బీఆర్‌ఎస్ పార్టీ తన అస్తిత్వం కోల్పోతుందనే భయంతో ఇలాంటి ఆరోపణలు చేస్తోందని అన్నారు.
పాలమూరు నీళ్లు ఒక్క ఎకరాకు పారినా రాజీనామా చేస్తాం: అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ.ప్రత్యేక రాష్ట్రం సాధన సమయంలో కృష్ణ నీటి వాటాను సాధించాలన్న కసి ఉన్న తెలంగాణ ప్రజానీకాన్ని జాగో తెలంగాణ బాగో ఆంధ్ర అం టూ నినదించి రాష్ట్రాన్ని సాధించుకున్న త ర్వాత రాయలసీమ రాళ్ల సీమగా మారిందని తిరిగి రతనాలసీమగా మార్చేందుకు బేశజాలు లేవు బేసిన్లు లేవు అంటూ కృష్ణ నీటి ని ఆంధ్రకు అప్పనంగా అమ్ముకున్నారని కె సిఆర్ ఉమ్మడి పాలమూరు జిల్లా నుండి గెలుపొంది
ఈ ప్రాంతానికి తీరని అన్యా యం చేశారని అసలు ముద్దాయి కేసీఆర్ అని అన్నారు. పదేళ్ల టిఆర్‌ఎస్ పాలనలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మించకపోగా ఇతర సాగునీటి ప్రాజెక్టులను సైతం పట్టించుకోలేదన్నారు. పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకు నీళ్లు పారినట్లు రుజు వు చేసినా ఈ ప్రాంత ఎమ్మెల్యేల అంతా రాజీనామాకు సిద్ధంగా ఉన్నామన్నారు. వా రితోపాటు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఉన్నారు.






