10 August, 2026 | 3:57 AM

తెలంగాణ సుభిక్షంగా ఉండాలి

10-08-2026 01:21 AM

అమ్మవారి ఆశీస్సులు కావాలి

బోనాల వేడుకల్లో కేటీఆర్ 

హైదరాబాద్‌లోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు

హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): బోనాల పండుగ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం పర్యటించి వేడుకల్లో పాల్గొన్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఉదయం నాంపల్లిలోని ఏడు గుళ్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న కేటీఆర్.. అనంత రం చార్మినార్ వద్ద ఉన్న శ్రీ భాగ్యలక్ష్మి అ మ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అక్కడి నుంచి ఓల్డ్ సిటీలోని బంగారు మైసమ్మ అమ్మవారిని, అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం లాల్ దర్వా జా సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ‘తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు బోనాల పండుగ శుభాకాంక్షలు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆశీస్సు లు ప్రతి ఒక్కరిపై ఉండాలి. అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతు లందరూ సంతోషంగా ఉండాలి. హైదరాబాద్‌లో వ్యాపారాలు బాగా సాగాలి’ అని కేటీఆ ర్ ఆకాంక్షించారు. మీరాలంమండి శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన కేటీఆర్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.