calender_icon.png 27 December, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ ఖబడ్దార్!

27-12-2025 02:14:53 AM

  1. సిరిసిల్లలో చెప్పుల దండేసి ఊరేగిస్తాం
  2. ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఫైర్

హైదరాబాద్, డిసెంబర్  26 (విజయక్రాంతి): ‘కేటీఆర్ ఖబడ్దార్.. సీఎం రేవం త్‌రెడ్డిపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సిరిసిల్లోనే చెప్పుల దండ వేసి ఊరేగిస్తాం’ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ ప్రజలు చెప్పులతో కొట్టినా కేటీఆర్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. నీకు, మీ అయ్యకు సిగ్గూశరం ఉంటే తెలంగాణ రాష్ట్రానికి ఏమి చేశారో చెప్పాలి. మా సీఎం రేవంత్‌రెడ్డి ఆం ధ్రాకు వ్యతిరేకంగా ఎప్పు డూ మాట్లాడలేదు.

గుంటూరులో చదువుకొని, అమెరికాలో ఉద్యోగం చేసిన నీకు తెలంగాణ గురించి ఏమీ తెలియదని మాత్రమే మాట్లాడారు. గూగుల్ సెర్చ్ చేస్తే దుబాయ్ శేకర్ కేసీఆర్ అని వస్తుంది. జూబ్లీహిల్స్, సర్పంచ్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన నీవు.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అన్‌ఫిట్ అని మీ కార్యకర్తలే అంటున్నారు. నీ చెల్లెలే నిన్ను దెయ్యమని అంటోంది. సొంత చెల్లె ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేదు. నీ వ్యవహారం ఇలానే ఉంటే భవిష్యత్‌లో తెలంగాణ ప్రజలు చెప్పులు అరిగేలా కొట్టి నీ మెడలో వేసి ఊరేగిస్తారు జాగ్రత్త’ అంటూ హెచ్చరించారు.