27-12-2025 02:15:59 AM
ఆదిలాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాం తి): సోయాబీన్ సాగు చేసి ఇబ్బందుల్లో ఉన్న రైతులకు న్యాయం చేయాలని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నాఫెడ్ ద్వారా తక్షణమే కొనుగోళ్లు జరిపించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృ తిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరారు.
శుక్రవారం ఆదిలాబాద్ పర్యటనలో ఉన్న కిషన్‌రెడ్డిని పెన్ గంగా గెస్ట్ హౌస్లోమంత్రి జూపల్లి కలిసి రైతుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. రైతులతో కలిసి వారి సమస్యలను కిషన్ రెడ్డికి వివరించారు.
ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది
కేంద్రమంత్రితో భేటీకి ముందు మంత్రి జూపల్లి కృష్ణారావు నేరడిగొండ మార్కెట్ యార్డును ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ పంట అమ్మకానికి వేచి ఉన్న రైతులతో నేరు గా మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యను పరిష్కరిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మం త్రి జూపల్లి మాట్లాడుతూ.. అకాల వర్షాల వల్ల సోయాబీన్ పంట నాణ్యత దెబ్బతినడంతో పాటు సోయాబీన్ రంగు మారిదంని.. ఇది రైతులకు మరింత శాపంగా మారిందని వివరించారు.
మార్కెట్ యార్డుల్లో రైతులు తమ పంటను విక్రయించేందుకు రోజుల తరబడి ఎదురుచూస్తున్నారు. కొనుగోళ్లు నిలిచిపోవడంతో గ్రామాల్లోని రైతుల ఇళ్లలోనే సోయా నిల్వలు పేరుకుపోయాయనీ, కేంద్రం చొరవ తీసుకుంటేనే రైతులకు మద్దతు ధర దక్కుతుందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు.
సోయాబీన్ కొనుగోళ్లలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించాలని ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ శాఖకు లేఖ రాశారని మంత్రి జూపల్లి ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, కేం ద్రం కూడా సానుకూలంగా స్పందించి నాఫెడ్ ద్వారా కొనుగోళ్లు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.