calender_icon.png 27 December, 2025 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్‌లో పాత్రికేయుల శాంతి ర్యాలీ

27-12-2025 02:14:07 AM

నిర్మల్, డిసెంబర్ ౨౬ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న పాత్రికేయులకు ఇంటి స్థలాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షలు శుక్రవా రం నాటికి నాలుగు రోజులకు చేరుకున్నాయి. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిర్మల పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించి ట్యాంక్బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు.

దీక్ష చిత్రం వద్ద చేపట్టుతున్న నిరసనకు ఉపాధ్యాయ సంఘం నేతలు దేవేందర్‌రెడ్డి, బీసీ సంఘం నేత తటకరి సాయ న్న, పోతన గంగాధర్, బీఆర్‌ఎస్ సోషల్ మీడి యా ఇంచార్జ్ రిజ్వాన్, సంస్కృత భాషా ప్రచా ర సమితి జిల్లా అధ్యక్షులు వెంకట్, వివిధ ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. డిమాండ్ పరిష్కరించే వరకు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.