9 April, 2026 | 1:19 AM

రాజకీయాలకు కేటీఆర్ బ్రేక్

01-12-2024 01:59 AM
  1. కొన్ని రోజులు విశ్రాంతి
  2. ప్రత్యర్థులు నన్ను మరిచిపోలేరు

హైదరాబాద్, నవంబర్ 30 (విజయక్రాంతి): రాష్ట్ర రాజకీయాలకు, పార్టీ కార్యక్రమాలకు కొద్దిరోజులపాటు దూరంగా ఉంటానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారవు ప్రకటించారు. కొంతకాలం వెల్‌నెస్ రీట్రీట్‌కు వెళ్ల నున్నట్టు శనివారం ఎక్స్ వేదికగా తెలిపారు. తాను రీఫ్రెష్ కావాలనుకుంటున్నానని పేర్కొన్నారు.

తిరిగి వచ్చే వరకు తనను రాజకీయ ప్రత్యర్థులు మర్చిపోరని అనుకుంటున్నానని చమత్కరించారు. జైలు జీవితాన్ని గుర్తు చేసే బ్యాడ్జీ జీవితాంతం తనకు ఆరాధనీయమని పేర్కొన్నారు. 15 సంవత్సరాల కితం ఇదేరోజు తాను అరెస్టు అయి వరంగల్ జైలులో ఉన్నట్టు గుర్తుచేశారు.

గత నెల రోజులుగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై విమర్శలు, ఆరోపణలు చేసిన బీఆర్‌ఎస్ పార్టీ యువనేత ఒక్క సారిగా ఈ నిర్ణయం ప్రకటించడం వెనుక మతలబు ఏమిటనే చర్చ  రాజకీయ సర్కిళ్లలో జోరుగా నడుస్తోంది. ముఖ్యంగా గులాబీ పార్టీ శ్రేణులతోపాటు సిరిసిల్ల నియోజకవర్గ కార్యకర్తలు ఏం జర గబోతున్నదనే ఆలోచనలో పడ్డారు. దీంతో కేటీఆర్ ఇక్కడే ఉంటారా? లేక విదేశాలకు వెళ్తారా? అనేది ఆసక్తిగా మారింది.