6 July, 2026 | 3:58 PM

Breaking News

ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •   ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ కె. హరిత   •   శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •   టెండర్లు పూర్తికాగానే తాసిల్దార్ కార్యాలయానికి భూమి పూజ   •   ఓటరు జాబితా సవరణపై ఆదివాసి గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు.   •  

ఢిల్లీ పార్టీల మ్యానిఫెస్టోలు చిత్తుకాగితంతో సమానం: కేటీఆర్

03-04-2025 10:04 AM

హైదరాబాద్: ఢిల్లీ పార్టీల మ్యానిఫెస్టోలు చిత్తుకాగితంతో సమానమని, అడ్డదారిలో అధికారంలోకి రావడానికి అందులో చెప్పేవన్నీ మాయమాటలేనని ముఖ్యమంత్రి మరోసారి నిరూపించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫ్రీ ఎల్ఆర్ఎస్(Free LRS) అని మభ్యపెట్టి, అధికారంలోకి రాగానే నాలుగున్నర లక్షల మంది నుంచి ఏకంగా రూ. 1400 కోట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముక్కుపిండి వసూలుచేశారని మండిపడ్డారు.

మరో 15,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీచేసి ఖజానా నింపుకునేందుకు గడుపు పెంపు పేరిట మరో ఘరానా దోపిడీకి తెరలేపారని ధ్వజమెత్తారు. నాడు ఉచిత ఎల్ఆర్ఎస్ అని హామీ ఇచ్చి జనం జేబులు ఖాళీ చేస్తున్న కాంగ్రెస్ సర్కారు(Congress Govt) మాట తప్పినందుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) హయాంలో సంక్షేమం రూపంలో వేల కోట్లు గడప గడపకు చేరితే, కాంగ్రెస్ హయాంలో రివర్స్ గేర్ లో ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన ప్రజల నుంచి వేల కోట్లు వసూలు చేయడం పేద, మధ్యతరగతి ప్రజలకు  వెన్నుపోటు పొడవడమేనని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.