6 July, 2026 | 3:04 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

చిత్రగుప్త యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడిపై దాడి

03-04-2025 01:42 AM
  • బండి సంజయ్‌పై వీడియోలపై అభ్యంతరం చేశారని ఆగ్రహం 
  • చితకబాదిన బీజేపీ కార్యకర్తలు 

రాజేంద్రనగర్, ఏప్రిల్ 2: చిత్రగుప్త యూ ట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు దారమోని గిరీష్‌పై బీజేపీ నాయకులు, కార్యకర్తలు దా డి చేశారు. దారమోని గిరీష్ గతంలో బీజేపీ నాయకుడు. కొన్నిరోజులుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మీద అనుచిత, అభ్యంతరకర వీడియోలు చేశాడని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

మంగళవారం రాత్రి అత్తాపూర్ ఈశ్వర్ థియేటర్ సమీపంలో  ఓ అపార్ట్‌మెంట్‌లోకి బీజేపీ మహిళా కార్యకర్తలు, నాయకులు చేరుకున్నారు.  మూకుమ్మడిగా దాడి చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని దారమోని గిరీష్‌ను రక్షించే యత్నం చేశారు.

ఈ క్రమంలో పోలీసులను కూ డా అడ్డుకొని దాడులు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేర కు పోలీసులు 45 మందిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఐదుగురు మహిళలను అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.