‘పద్మ’ అవార్డుల ప్రదానం
24-06-2026 01:13 AM
రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. 2026 సంవత్సరానికి సంబంధించి గణతంత్ర దినోత్సవమైన జనవరి 26న ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 131 మందిని ఈ పద్మ అవార్డులతో గౌరవించారు. ఇందులో ఐదుగురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. అవార్డులు అందుకున్న వారిలో మురళీమోహన్, రాజేంద్రప్రసాద్, మమ్ముట్టి, ఆర్ మాధవన్, ఆల్కా యాగ్నిక్ ఉన్నారు.






