21 July, 2026 | 7:26 PM

Breaking News

జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి   •   అమ్మ నగర్ బ్రిడ్జితో దూరభారం తగ్గుతుంది   •   నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలి   •   జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యం   •   సీజనల్ వ్యాధులు ప్రబలకుండా విస్తృత అవగాహన   •   సుల్తానాబాద్ మున్సిపాలిటీ 17 బూతుల బిఎల్ఎ 2 ల సమావేశం   •   ఫోటో, వీడియో గ్రాఫర్ల కు అండగా ఉంటాం: మేయర్ కొలగాని   •   ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలి   •   సర్పంచ్ పగడాల రమాదేవి అధ్వర్యంలో తడి–పొడి చెత్త బుట్టల పంపిణీ   •   ఇల్లందు–బొమ్మనపల్లి ట్రాఫిక్ డైవర్షన్ ఎత్తివేత   •  

ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు

21-07-2026 03:31 PM

సీఎంకు రెండే రెండు తెలుసు.. ఓట్లు.. తిట్లు

రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ

లక్సెట్టిపేట: బీఆర్ఎస్ పార్టీ తరుఫున రైతలుకు అండగా ఉంటున్నామని, రేవంత్ రెడ్డి(Revanth Reddy) పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు(Farmers facing difficulties) పడుతున్నారని మంచిర్యాల జిల్లా(Mancherial District) లక్సెట్టిపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ రైతు సదస్సులో(BRS Rythu Sadassu) కేటీఆర్ పేర్కొన్నారు. రైతులు చనిపోయినా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని ధ్వజమెత్తారు. ఎల్లంపల్లిలో 7 టీఎంసీల నీరు మాత్రమే ఉందన్న కేటీఆర్ బాగా వర్షం పడితే ఎస్సారెస్పీ నిండుతుందని తెలిపారు.. కడెం నుంచి ఎల్లంపల్లికి నీరు వస్తుందని వెల్లడించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని కేటీఆర్ ఆరోపించారు. ఒకరోజు నీరు లేవంటారు.. రెండోరోజు మరో కథ చెబుతారని కేటీఆర్ విమర్శించారు.

సీఎం రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) రెండే రెండు తెలుసన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఓట్లు.. తిట్లు అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షెట్టిపేట రైతుల మరణాలు విషాదకరమని కేటీఆర్ పేర్కొన్నారు. రెండు నెలలైనా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం సాయం చేయలేదని మండిపడ్డారు. రైతుల కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, నాలుగు రైతు భరోసాలను రేవంత్ రెడ్డి మింగేశారని తెలిపారు. కేసీఆర్ హయాంలో యూరియా పొలం దగ్గరికే వచ్చేదన్న కేటీఆర్ ఇప్పుడు యూరియా యాప్ లో మాత్రమే దొరుకుతోందన్నారు. కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ వివరించారు. కన్నెపల్లిలో పంపుల విషయంలో డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో నిర్వహించే రైతు సదస్సుకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు మార్గమధ్యంలో ధర్మారం వద్ద మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ధర్మపురి నియోజకవర్గ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేటీఆర్ కి ఘనంగా స్వాగతం పలికారు.