17 April, 2026 | 4:23 PM

సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చాం : కేటీఆర్

16-12-2024 02:02 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ శాసనసభ లాబీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. వారం రోజుల తర్వాత తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. అప్పుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం చెప్పిన అబద్దాలు ఆర్బీఐ నివేదికతో తేటతెల్లమైందని, సభను తప్పదోవ పట్టిస్తున్నారని సభా హక్కుల ఉల్లంఘన నోటీసును స్పీకర్ కు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులపై వాస్తవాలను సరి చేసుకుంటే ఇబ్బందేమి లేదని పేర్కొన్నారు.

గతంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై సభ హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తే అప్పటి స్పీకర్ చర్చకు అనుమతిచ్చారని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎమ్మెల్యే ప్రొటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్ కు ఫిర్యాదు చేశామని, ప్రభుత్వ కార్యక్రమాలను కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ లను పిలుస్తున్నారు కానీ, ఆ నియోజకవర్గ ప్రతిపక్షంలో ఉన్న శాసన సభ్యులను, గానీ, ఎంపీలను గానీ ఆహ్వానంచట్లేదని నోటీసులో పేర్కొన్నారు. లగచర్లపై ప్రత్యేక చర్చ జరిపాలని స్పీకర్ ను కోరినట్లు ఆయన వెల్లడించారు. లగచర్ల రైతులు ఇబ్బంది పడుతుంటే పర్యాటకంపై చర్చ ముఖ్యమా..? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డని కేటీఆర్ ప్రశ్నించారు.