24లోగా స్పందించకుంటే.. మోహన్‌బాబును అరెస్టు చేస్తాం: సీపీ
మోహన్ బాబు కేసు
రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు
ఎల్బీనగర్ : సినీ నటుడు మోహన్ బాబుపై నమోదైన కేసులపై విచారణ కొనసాగుతున్నదని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. సోమవారం ఎల్బీనగర్ లోని రాచకొండ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే మోహన్ బాబుకు నోటీసులు జారీ చేశారని, కోర్టు సూచనల ప్రకారం నడుచుకుంటామన్నారు. మోహన్ బాబు పై మొత్తం మూడు కేసులు నమోదయ్యాయని తెలిపారు. పోలీసుల విచారణకు ఈనెల 24 వరకు మోహన్ బాబు సమయం అడిగారని చెప్పారు. హైకోర్టు ఈ నెల 24 వరకు మోహన్ బాబుకు సమయం ఇచ్చింది. అప్పటివరకు రెస్పాన్స్ కాకపోతే మరోసారి నోటీసులు జారీ చేస్తామన్నారు. రాచకొండ కమిషనర్ పరిధిలో మోహన్ బాబుకు గన్ లైసెన్స్ ఇవ్వలేదని చెప్పారు. మోహన్ బాబు వద్ద 2 గన్స్ ఉన్నట్టు మా వద్ద సమాచారం ఉన్నది.






