7 April, 2026 | 4:39 AM

‘ఎంటర్‌ప్రెన్యూర్ ఇండియా ఐడియా అవార్డ్స్’కు కేటీఆర్‌కు ఆహ్వానం

07-04-2026 03:05 AM

పారిశ్రామికాభివృద్ధికి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం

హైదరాబాద్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అరుదైన ఆహ్వానం లభించింది. బెంగళూరు వేదిక గా అత్యంత వైభవంగా జరగనున్న ‘ఎంటర్‌ప్రెన్యూర్ ఇండియా ఐడియా అవార్డ్స్ వేడుకకు ఆయనను ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. నవకల్పనలు, పారిశ్రామిక వృద్ధికి ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది.

ఏప్రిల్ 16న బెంగళూరు వైట్ ఫీల్డ్‌లోని షెరటన్ గ్రాండ్ హోటల్‌లో ఈ ప్రతిష్టాత్మక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మెగా ఈవెం ట్‌లో దేశవ్యాప్తంగా ఉన్న 300 మందికి పైగా అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లు, అంకుర సంస్థల (స్టార్టప్) వ్యవస్థాపకులు, వ్యాపారరంగ నిపుణులు ఒకే వేదికపైకి రానున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్న దార్శనిక నాయకులను ఈ సందర్భంగా సత్కరించనున్నారు.

సాంకేతికత, ఆవి ష్కరణలు, ఆర్థికాభివృద్ధి రంగాల్లో కేటీఆర్ చూపిన డైనమిక్ నాయకత్వాన్ని నిర్వాహకులు కొనియాడారు. తెలంగాణ ఐటీ, పరి శ్రమల శాఖమంత్రిగా ఆయన హయాంలో తీసుకొచ్చిన ప్రగతిశీల విధానాలు, స్టార్టప్ ఎకోసిస్ట మ్ అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి దేశవ్యాప్తంగా ఎంతోమంది యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినిచ్చాయని ఆహ్వాన పత్రంలో పేర్కొన్నారు. ఈ సదస్సులో కేటీఆర్ ప్రసంగించాల ని, ఆయన మాటలు భావిపారిశ్రామికవేత్తల్లో నూతనోత్సాహం నింపుతాయన్నారు.