calender_icon.png 25 May, 2025 | 7:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్‌ను కలిసిన కేటీఆర్.. కవిత లేఖ దృష్ట్యా భేటీకి ప్రాధాన్యం

25-05-2025 04:43:40 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం కలిశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ, వ్యాఖ్యలు, సంబంధిత పరిణామాలు, అలాగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణ, కాళేశ్వరం కమిషన్ నోటీసులపై చర్చించనున్నట్లు సమాచారం. కవిత లేఖ, వ్యాఖ్యల దృష్ట్యా కేసీఆర్, కేటీఆర్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

కేసీఆర్ కు కవిత అంతర్గతంగా లేఖ రాసిన సంగతి తెలిసిందే. కవిత బహిర్గతంగా రాసిన లేఖ బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతోంది. కేసీఆర్ దేవుడు.. కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ ఆమె శంషాబాద్ ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడుతూ ఇలా వ్యాఖ్యానించడం ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. నిన్న కేటీఆర్ మాట్లాడుతూ... పార్టీలో ఉన్న కార్యకర్తలందరికీ ప్రజాస్వామిక సూర్తి కలిగిన కేసీఆర్ కు లిఖితపూర్వకంగా లేదా మౌఖికంగా సూచనలిస్తూ ఎవరైనా లేఖలు రాయొచ్చు. కానీ పార్టీలో ఏ హోదాలో ఉన్నవారైన సరే కొన్ని అంతర్గత విషయాలో అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుందని కేటీఆర్ చెప్పారు.