20-07-2025 04:23:22 PM
హైదరాబాద్: జైపూర్ లో నిర్వహించిన 'టాక్ జర్నలిజం 2025'లో మరియా షకీల్ తో జరిగిన చర్చలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో జనాభా నియంత్రణను అద్భుతంగా పాటించిన దక్షిణాదికి నష్టం జరగవద్దన్నారు. బిహార్ లో ఓటర్ల జాబితా సవరణపై విమర్శలు వస్తున్నాయని, రాజకీయలబ్ధి కోసం విధ్వేషాలు సృష్టించడం చాలా సులభమని కేటీఆర్ పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో సీట్లతో కూడిన డీలిమిటేషన్ వల్ల ఉత్తరప్రదేశ్‌కు ప్రయోజనం చేకూరితే, అది ఖచ్చితంగా హిందీ రాష్ట్రం మిగిలిన భారతదేశానికి విధానాలను నిర్ణయిస్తుందనే భావనకు దారితీస్తుందని తెలిపారు. ప్రజలు రోడ్ల మీద ధర్నాలు చేయనంత మాత్రాన బాగుందని అనుకోవద్దు అని, ప్రజలు రాజకీయ పార్టీలు, వ్యవస్థ మీద చాలా అసంతృప్తిగా ఉన్నారని విమర్శించారు.
"భాష కేవలం కమ్యూనికేషన్ సాధనం కాదు.. అది ఒక సాంస్కృతిక గుర్తింపు. భారతదేశానికి అధికారిక భాష లేదు. దీనికి 22 అధికారిక భాషలు మరియు 300 అనధికారిక భాషలు ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. నేను మీ మీద తెలుగు రుద్దబోదడం లేదు, మరి మీరు నా మీద హిందీ ఎందుకు రుద్దుతున్నారు..? ప్రశ్నించారు. సీట్ల పునర్విభజన లేదా డీలిమిటేషన్‌కు జనాభా మాత్రమే ఆధారం కాదు. ఇది విధానాలు, ఆర్థిక వనరుల కేంద్రీకరణకు దారితీస్తుందన్నారు. ప్రధానమంత్రి ఎవరు కావాలో హిందీ బెల్ట్ వారే నిర్ణయిస్తారని రాజకీయ పార్టీలు భావించడం ప్రారంభించే కొద్దీ, మొత్తం దృష్టి హిందీ బెల్ట్ కు సరిపోయే విధానాలను రూపొందించడంపైనే ఉంటుంది. భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలు దిక్కుతోచని స్థితిలో మిగిలిపోతాయని కేటీఆర్ ఆరోపించారు.