20-07-2025 03:20:38 PM
హైదరాబాద్: రాబోయే మూడు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ అంచనా వేసింది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా.. హైదరాబాద్ నగరం జలమయమైంది. ఆదివారం హైదరాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాల్లో మూడు నాల్గు రోజుల పాటు 115.6 మిమీ నుండి 204.4 మిమీ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. నేడు, రేపు 64.5 మిమీ నుండి 115.6 మిమీ వరకు భారీ వర్షపాతం నమోదవుతుందని, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
జూలై 26 వరకు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, నాగర్‌కుర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలోని జగిత్యాల్, జనగాం, యాదాద్రి భోంగీర్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాలు.