15 May, 2026 | 2:04 AM

ఇంటర్ విద్యలో భారీ మార్పులు

15-05-2026 01:02 AM
  1. ఇకపై ఫస్ట్ ఇయర్‌లోనూ ప్రాక్టికల్స్ 
  2. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌ను ప్రవేశపెట్టిన బోర్డు
  3. ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలో ప్రాక్టికల్స్ 
  4. ఫస్ట్ ఇయర్‌లో 15, సెకండ్ ఇయర్‌లో 15 మార్కులకు ప్రాక్టికల్స్ 
  5. గణితంలో 75కు బదులు 60 మార్కులకు ఫైనల్ పరీక్షలు 
  6. ఇంటర్నల్ అసెస్‌మెంట్‌కు ఒక్కో ఏడాదికి 15 మార్కులు 
  7. భాషా విభాగాల్లోనూ 100కు బదులు 80 మార్కులకు ఫైనల్ పరీక్షలు

హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): ఇంటర్ విద్యలో కీలక మార్పులుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. 2026-27 విద్యాసంవత్సరం నుంచి ఈ నూతన విధానం అమలు చేయనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. మొత్తంగా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌ను ప్రవేశపెట్టింది. సైన్స్ విద్యార్థులకు గతంలో ఉన్న 30 మార్కుల ప్రాక్టికల్స్ విధానాన్ని రెండు సంవత్సరాలకు విభజించింది. ఇకపై ఇంటర్ మొదటి సంవత్సరంలోనూ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీకి ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు.

ప్రాక్టికల్స్ పరీక్షలకు ఫస్ట్ ఇయర్‌లో 15 మార్కులు, సెకండియర్‌లో 15 మార్కులు కేటాయించనున్నారు. గణితంలోనూ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌ను ప్రవేశపెట్టింది. గణితంలో 75 మార్కులకు బదులు 60 మార్కులకు ఫైనల్ (థియరీ) పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్నల్ అసెస్మెంట్‌కు ఒక్కో ఏడాదికి అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌కు 15 మార్కులు చొప్పున కేటాయించనున్నారు. అదేవిధంగా హ్యుమానిటీస్‌లో కూడా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌కు 20 మార్కులు కేటాయిస్తారు.

ఫైనల్ థియ రీ పరీక్షలు 100 మార్కులకు బదులు 80 మార్కులకే నిర్వహించనున్నారు. భాషా (లాంగ్వెజెస్) సబ్జెక్టులలోనూ 100 మార్కులకు బదులు 80 మార్కులకు ఫైనల్ థియరీ పరీక్షలు, 20 మార్కులు ఇంటర్నల్ అసెస్మెంట్‌కు కేటాయించనున్నారు. ఎంఈసీ మ్యాథమెటిక్స్‌కు గతంలో ఇంటర్నల్ అసెస్మెంట్ ఉండేది కాదు. 75 మార్కులకు థియరీ పరీక్షే ఉండేది. కానీ ఇప్పుడు 20 మార్కులను ఇంటర్నల్ అసెస్మెంట్‌కు, 80 మార్కులు థియరీ పరీక్షకు కేటాయిస్తారు.

అలాగే ఎంఈసీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా గణిత ప్రశ్నపత్రాన్ని రూపొందించనున్నారు. ఈ సంస్కరణల నేపథ్యంలో పాఠ్యపుస్తకాలను కూడా సవరించింది. మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం సవరించిన సిలబస్‌తో కూడిన పుస్తకాలను నిపుణుల కమిటీ పర్యవేక్షణలో రూపొందించారు. ఈ కొత్త పుస్తకాల్లో డయాగ్రామ్స్, నాలెడ్జ్ బాక్సులు, క్యూఆర్ కోడ్లు, భారతీయ జ్ఞాన వ్యవస్థలకు సంబంధించిన సమాచారాన్ని చేర్చారు.

విద్యార్థులకు ఈ పుస్తకాల పంపిణీని జూన్ 1వ తేదీ లోపు పూర్తిచేస్తామని, గతేడాది కంటే తొందరగానే ఈసారి పంపిణీ ప్రక్రి య పూర్తిచేస్తామని ఇంటర్ బోర్డు స్పష్టంచేసింది. ఈసారి నుంచి ఏసీఈ (అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్) పేరుతో కొత్త గ్రూపును బోర్డు ప్రవేశపెడుతోంది. జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ ఈనెల 12 నుంచే ప్రారంభమైంది.

ఇంటర్ విద్యలో చేసిన మార్పులు ఇవే..

* ఇకపై ఫీజిక్స్, కెమిస్ట్రీ, బొటనీ, జువాలజీలో ఇంటర్ మొదటి సంవత్సరంలోను ప్రాక్టీకల్ పరీక్షలు.

* మొదటి సంవత్సరంలో 15 మార్కులు, రెండో ఏడాది 15 మార్కులకు ప్రాక్టికల్స్.

* మ్యాథ్స్‌లో యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్

* మొదటి, ద్వితీయ సంవత్సరాల్లో ఇంటర్నల్ అసెస్మెంట్‌కి ఒక్కో ఏడాదికి 15 మార్కులు కేటాయింపు.

* మ్యాథమేటిక్స్‌లో 75 మార్కులకు బదులు 60 మార్కులకు ఫైనల్ థియరీ పరీక్షలు.

* హ్యుమానిటీస్ సబ్జెక్టులోను యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్‌కి 20 మార్కులు.

* ఫైనల్ పరీక్షలు 100 మార్కులకు బదులు 80 మార్కులకే నిర్వహణ.

* భాషా విభాగాల్లోనూ 100 మార్కులకు బదులు 80 మార్కులకు ఫైనల్ థియరీ పరీక్షలు, 20 మార్కులు ఇంటర్నల్ అసెస్మెంట్.