24 July, 2026 | 2:58 PM

మోడీ.. జాగ్రత్తగా ఉండు.. నిన్నూ.. నీ బీజేపీని తొక్కుతరు

24-07-2026 01:47 PM
  • యువత పోరాటానికి అండగా ఉండేందుకే నిరనస
  • మోదీ, అమిత్ షా కుర్చీలు అడిగారా.. అధికారం కోరారా
  • రాజకీయాలతో యువత పోరాటాన్ని మలినం చేయవద్దు

హైదరాబాద్: ఢిల్లీలో విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అణచివేతకు, దాష్టీకానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (BRSV) ఇందిరాపార్కు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao), బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.... మోదీ, అమిత్ షా కుర్చీలు అడిగారా.. అధికారం కోరారా? రాజీనామా చేసి ప్రభుత్వాన్ని అప్పగించాలని యువత కోరారా? అన్యాయం జరిగిన విద్యార్థులకు న్యాయం చేయాలని కోరానని వెల్లడించారు. విద్యార్థులకు న్యాయం జరగాలని సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష చేపట్టారని వివరించారు. జవాబుదారీతనం, విద్య విధానంలో సంస్కరణలు చేపట్టాలని నిరసన చేపట్టమని కేటీఆర్ పేర్కొన్నారు. నిరసనలను మీడియా చూపకపోయిన.. జెన్ జీ సోషల్ మీడియా దేశం మొత్తాన్ని కదిలించిందని స్పష్టం చేశారు.

ఢిల్లీలో పార్టీలకు అతీతంగా నిరసనలు కొనసాగున్నాయని కేటీఆర్ సూచించారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత కదం తొక్కుతున్నారని తెలిపారు. ఢిల్లీ జంతర్ మంతర్(Delhi Jantar Mantar) వద్ద యువత గళం విప్పుతున్నారని చెప్పారు. యువత పోరాటానికి అండగా ఉండేందుకే నిరసన కార్యక్రమం చేపట్టామని కేటీఆర్ ప్రకటించారు. ఢిల్లీ మెడలు వచ్చి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించిన విషయాన్ని ప్రస్తావించారు. రాజకీయ అజెండాలతో యువత పోరాటాన్ని మలినం చేయవద్దని పిలుపునిచ్చారు. ఢిల్లీలో విద్యార్థులపై దాడులు చూస్తే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 'నరేంద్ర మోదీ యాది పెట్టుకో.. జెన్ జీ యువతకు మీ మోసాలు అర్ధమైనయ్! వాళ్ళు పొట్టు పొట్టు ఆకలితో ఉన్నరు.. నిన్నూ.. నీ బీజేపీని తొక్కుతరు' అని కేటీఆర్ ప్రధాని మోదీని హెచ్చరించారు.