19-05-2024 03:09:01 PM
హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ సమావేశానికి ఎన్నికల కమిషన్ ఆదివారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ సమావేశానికి సీఈసీ కొన్ని షరతులు విధించింది.కేబినెట్‌లో అత్యవసరమైన విషయాలపైనే చర్చించాలని సూచించింది. జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని ఆదేశించింది. రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాలపై చర్చించవద్దని తెలిపింది. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు కేబినెట్ భేటీలో పాల్గొనవద్దని పేర్కొంది. తెలంగాణ సచివాలయంలో నిన్న జరగాల్సిన మంత్రివర్గ సమావేశం ఈసీ నుంచి అనుమతులు రాకపోవడంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.
