రైతు భరోసాపై రైతుల్లో భరోసా పోయింది
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ రుణమాఫీ డోల్ల అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. 60 శాతం రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదని, ఎల్లుండి నుంచి క్షేత్రస్థాయిలో రుణమాఫీ కాని వారి వివరాలు సేకరించి జిల్లా కలెక్టర్లకు, ప్రభుత్వ పెద్దలు, ముఖ్య అధికారులకు అందిస్తామని కేటీఆర్ తెలిపారు. రైతుల పంటల రుణమాఫీ కోసం ప్రత్యేక్ష కార్యాచరణ చేపట్టి పోరాటాలు చేస్తామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుందని ఆశాభావంతో ఉన్నాం.
రుణమాఫీకి రూ.49 వేల కోట్లు కావాలని ఎస్ఎల్బీసీలో అన్నారని కేటీఆర్ చెప్పారు. ఏడాది కడుపు కట్టుకుని రూ.41 వేల కోట్లు మాఫీ చేస్తామన్నారని, రూ.49 వేల కోట్లు అని చెప్పి రూ.17 వేల కోట్లతో ముగించినట్లు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ చేయకుండా 28 లక్షల కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారని, రైతు భరోసాపై రైతుల్లో భరోసా పోయిందన్నారు. రుణమాఫీ తరహాలోనే రైతు భరోసా చేస్తారని భావిస్తున్నట్లు ఆయన ఎద్దేవా చేశారు.






