17 June, 2026 | 9:47 PM

రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులపై స్పందించిన కేటీఆర్

17-08-2024 04:53 PM

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులపై బిఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ శనివారం స్పందించారు. ఆగస్టు 24వ తేదీన రాష్ట్ర మహిళా కమిషన్ ముందుకెళ్తాను అని, గత 8 నెలల్లో మహిళలపై జరిగిన ఘటనల వివరాలు తీసుకెళ్తానన్నారు. నేను బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వత కూడా నోటీసులు ఇచ్చారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశంలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యాలను కూడా కమిషన్ దృష్టికి తీసుకెళ్తానంటూ చెప్పుకొచ్చారు. నేను చట్టాలను గౌరవించే వ్యక్తిని, ఈనెల 24న ఉదయం 11 గంటలకు మహిళ కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.