ఆరు గ్యారంటీలపై ప్రైవేట్ మెంబర్ బిల్లు.. నోటీసులను స్పీకర్‌కు అందజేసిన కేటీఆర్
హైదరాబాద్: ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేట్ మెంబర్ బిల్లుకు సంబంధించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR), పార్టీ ఎమ్మెల్యేలు నోటీసును తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్(Telangana Speaker Gaddam Prasad)ని కలిసి అందజేశారు. ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లుతో ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే అవకాశం ఉంటుందని కేటీఆర్ తెలిపారు.
ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే అత్యంత కీలకమైన ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి అనుమతించాలని కేటీఆర్ స్పీకర్‌ను విజ్ఞప్తి చేశారు. స్పీకర్‌తో పాటు అసెంబ్లీ సెక్రటరీకి కూడా బిల్లుకు సంబంధించిన నోటీసులు అందజేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ అభయహస్త పేరుతో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత కల్పించాలంటూ ప్రైవేట్ మెంబర్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు ఇటీవల తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు.




