సోమవారం నాంపల్లి కోర్టుకు కేటీఆర్
18-10-2024 10:53 AM
హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ పరువు నష్టం కేసు విచారణలో భాగంగా తెలంగాణ మాజీ ఐటీ శాఖ మంత్రి కె.టి. రామారావు (కేటీఆర్) శుక్రవారం ఉదయం నాంపల్లి కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. కానీ సోమవారం నాంపల్లి కోర్టుకు కేటీఆర్ హాజరుకానున్నారు. వాంగ్మూలం ఇచ్చేందుకు సోమవారం నాడు కోర్టుకు వెళ్తారని కేటీఆర్ కార్యాలయం పేర్కొంది. మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి కేటీఆర్ ఆమెపై పరువునష్టం కేసు పెట్టిన విషయం తెలిసిందే.






