13 May, 2026 | 11:51 AM

ఇది ప్రజాపాలన కాదు.. ప్రతీకార పాలన

28-08-2024 11:12 AM

హైదరాబాద్: ప్రజావాణిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు. జీతం రావట్లేదని ప్రజావాణిలో రేణుక అనే ఉద్యోగం ఫిర్యాదు చేస్తే ఆమెను ఉద్యోగం నుంచి తీసేశారని కేటీఆర్ పేర్కొన్నారు. వెంటనే రేణుకను ఉద్యోగంలో నుంచి తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజావాణి ఆర్భాటం ఎక్కువ, పరిష్కారం తక్కువ అని, ఇది ప్రజాపాలన కాదు.. ప్రతీకార పాలన  అని కేటీఆర్ ఎద్దెవా చేశారు. ప్రజాదర్భార్ లో పరిష్కరించిన సమస్యలపై శ్వేతపత్రం ఇవ్వాలన్నారు.